: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 137 కోట్లు విడుదల


కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ విస్తరణకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గన్నవరం విమానాశ్రయాన్ని 9,520 చదరపు మీటర్లమేర విస్తరించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విస్తరణకు 137 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నెల 19న గన్నవరం విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు శంకుస్థాపన చేయనున్నారు. విమానాశ్రయ విస్తరణ పనులు భారత ఎయిర్ పోర్టు అథారిటీ చేపట్టనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి వైమానిక సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News