: మరో టైటిల్ కి చేరువలో సానియా, హింగిస్ జోడీ
చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఇండోస్విస్ టెన్నిస్ జోడీ దూసుకుపోతోంది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సహా ఏడు టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న సానియా మీర్జా, మార్టీనా హింగిస్ జోడీ చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్ లో 7-6 (5), 6-4 స్కోరు తేడాతో జూలియా (జర్మనీ), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) విజయం సాధించి, సెమీ ఫైనల్ లో చేరింది. గంటా 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన తొలి సెట్ ను టై బ్రేకర్ ద్వారా గెలుచుకున్న సానియా జోడీ, రెండో సెట్ ను సునాయాసంగా చేజిక్కించుకుంది. సానియా, హింగిస్ జోడీ ఈ టైటిల్ ను సాధిస్తే వరుసగా నాలుగు టైటిల్స్ సాధించిన జోడీగా నిలిచిపోతుంది.