: కోల్ స్కాంలో తనపై విచారణ వేగవంతం చేయాలని మన్మోహన్ పిటిషన్


బొగ్గు కుంభకోణం కేసులో తనపై జరుగుతున్న విచారణను వేగవంతం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. జిందాల్ గ్రూప్ కు కోల్ బ్లాక్స్ కేటాయించిన కేసులో తనను నిందితుడిగా చేర్చడంపై ఆయన ఆవేదనతో ఉన్నారు. ఈ క్రమంలోనే విచారణ త్వరగా జరగాలని కోరుకుంటున్నారు. గతంలో ఈ కేసులో మన్మోహన్ కు వ్యక్తిగత హాజరకు మినహాయింపు ఇచ్చింది. అయితే న్యాయస్థానంలో ప్రస్తుతం ఉన్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ కేసులో మన్మోహన్ అప్పీలుపై విచారణ 2018లో వస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News