: 'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపుపై రాజమౌళి హర్షం


ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురాబోతున్న 'రుద్రమదేవి' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు ఇవ్వడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన స్పందించారు. "తెలంగాణలో రుద్రమదేవికి పన్ను మినహాయింపు ఇచ్చినట్టు ఇప్పుడే నాకు తెలిసింది. చారిత్రాత్మక కథను తెరకెక్కించేందుకు సుదీర్ఘకాలం నుంచి కష్టపడుతున్న దర్శకుడు గుణశేఖర్ గారికి ఇది అద్భుతమైన వార్త. తెలంగాణలోలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి తప్పకుండా పన్ను మినహాయింపు ఇస్తుందనుకుంటున్నా" అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఇదే సమయంలో కథానాయకుడు ప్రభాస్ ఈ చిత్రంలో నటించిన తన స్నేహితులకు అభినందనలు తెలిపాడు.

  • Loading...

More Telugu News