: గూగుల్ లో అవి దొరకవు: పవన్ కల్యాణ్ మాజీ భార్య
సాంకేతిక ప్రపంచంలో ఏది కావాలన్నా గూగుల్ తల్లి మీద ఆధారపడుతున్నారని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ అన్నారు. గూగుల్ లో సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల గురించి తెలుసుకోవచ్చు కానీ, కరుణ, జాలి, దయ, మానవత్వం, సహనం వంటి సుగుణాల గురించి మాత్రం ఉండవని చెప్పారు. గూగుల్ తల్లి నుంచి పాఠాలు నేర్చుకోగలమని, సుగుణాలు మాత్రం కన్నతల్లి నుంచే నేర్చుకోగలమని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, పవన్ కల్యాణ్ నుంచి వేరుపడిన రేణూదేశాయ్ మరాఠా చిత్ర సీమలో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.