: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు
ఏఐఎంఐఎం పార్టీ నేతలు, సోదరులైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ మార్ఫింగ్ ఫోటోను ఫేస్ బుక్ లో అసద్ పోస్టు చేశారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. మరోవైపు బీహార్ ఎన్నికల ప్రసంగంలో మోదీపై అసద్ సోదరుడు, ఎమ్మెల్యే అక్బర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.