: తలసాని రాజీనామా చేయలేదు... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయిని
టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరి, మంత్రి పదవిని అలంకరించారు. ఆ తర్వాత ఈ విషయంపై అనేక విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే, మంత్రి అయ్యాయని ఓ వైపు తలసాని చెబుతున్నారు. స్పీకర్ మధుసూదనాచారే ఇంతవరకు రాజీనామాను ఆమోదించలేదని అంటున్నారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా ఔననే అంటున్నారు. మరోవైపు, ఈ వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది. కానీ, అసలు జరిగిన విషయమేమిటో టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ రోజు స్పష్టం చేశారు. తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందా? అని మీడియా ప్రతినిధులు నాయినిని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, ఎందుకు వస్తుంది? తలసాని రాజీనామా చేయలేదు కదా? అని చెప్పారు. దీంతో, షాక్ కు గురవడం మీడియా వంతు అయింది.