: పుతిన్ కు కానుకగా బంగారం అద్దిన ఐఫోన్
టైటానియం తొడుగు, దానిపై బంగారంతో రూపొందించిన పుతిన్ చిత్రం, రష్యా జాతీయ చిహ్నంతో పాటు ఆ దేశ జాతీయ గీతంలోని కొన్ని వాక్యాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఐ ఫోన్ 6ఎస్ ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కానుకగా ఇచ్చింది కేవీయర్ నగల వ్యాపార సంస్థ. నిన్న తన 63వ పుట్టిన రోజు జరుపుకున్న పుతిన్ కు ఈ కానుకను అందజేసింది. ఈ ప్రత్యేకమైన ఐ ఫోన్ లు అమ్మకానికి సిద్ధమయ్యాయి. కేవలం 63 హ్యాండ్ సెట్లు మాత్రమే ఆ సంస్థ విక్రయిస్తుంది. ఈ విధంగా ప్రత్యేకంగా రూపొందించిన ఐ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 3,200 డాలర్లు, 128 జీబీ వేరియంట్ ధర 3,356 డాలర్లు. ఆ ఫోన్లతో పాటు చాలా ఖరీదైన ఒక ఉడెన్ కేన్ ని కూడా తయారు చేసి ఇస్తున్నారు.