: మిషన్ కాకతీయకు విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు కేంద్రం అనుమతి


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ట్రస్ట్ ద్వారా విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే విరాళాలను ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులకు వినియోగించనుందని చెప్పారు. తొలి దశ మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా మారాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రైతులను ఆదుకునే దశలో భాగంగానే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని చేపట్టినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News