: మీరు వాట్స్ యాప్ 'అడ్మిన్'గా ఉన్నారా? జాగ్రత్తండోయ్!


ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్స్ యాప్ లో నయా ట్రెండ్ 'గ్రూప్స్'. కొత్తగా గ్రూపులు క్రియేట్ చేస్తూ, వాటికి అడ్మిన్ గా ఉండటం లేటెస్ట్ యూత్ ఫ్యాషన్. ఓ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో ఎంత మంది ఎక్కువ సభ్యులను చేర్చగలిగితే వారు అంత ఎక్కువగా పాప్యులర్ అయినట్టు భావిస్తూ సంబరాలు చేసుకుంటున్న నవ యువ సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ఓ గ్రూప్ కు అడ్మిన్ గా ఉన్నంత మాత్రాన సరిపోదు. గ్రూప్ లో షేరింగ్ అయ్యే కంటెంట్ మొత్తానికీ మీదే బాధ్యతని గుర్తుంచుకోవాలి. ఏ విధమైన తప్పుడు సమాచారం షేర్ అవుతున్నా అరెస్ట్ కూడా కావాల్సి రావచ్చు. విషయం తెలియని ఓ వాట్స్ యాప్ గ్రూప్ అడ్మిన్ ఇలానే ఇప్పుడు జైల్లో పడ్డాడు. మహారాష్ట్రలోని లాతూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. శివాజీ బర్చే అనే అతను ప్రారంభించిన గ్రూప్ లో ఉన్న మిత్రులెవరో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో తాను పెట్టకపోయినా, అడ్మిన్ గా ఉన్నందుకు శివాజీని పోలీసులు జైల్లోకి తోశారు. అతనితో పాటు మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. సో వాట్స్ యాప్ అడ్మిన్స్... బీ కేర్ ఫుల్!

  • Loading...

More Telugu News