: చైనా గాజువంతెనపై పగుళ్లు...పర్యాటకుల పరుగులు!


చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో పూర్తిగా గాజుతో తయారు చేసిన వంతెన ఎంతో ఆకర్షిస్తుండటంతో అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగానే ఉంది. కానీ, ఈ మధ్య ఆ వంతెనకు ఒక సమస్య వచ్చి పడింది. దానిపై చిన్నచిన్న పగుళ్లు ఏర్పడ్డాయట. దీంతో ఆ వంతెనకు ఏమైనా ప్రమాదం వాటిల్లి, కూలిపోతుందేమోనని పర్యాటకులు భయపడుతున్నారు. భూమికి, ఆకాశానికి మధ్య ఉండే ఈ వంతెనపై నడవాలంటే పర్యాటకులు వణికిపోతున్నారు. గత సోమవారం నాడు ఈ వంతెెనపై జరిగిన ఒక సంఘటన పర్యాటకులను పరుగులు పెట్టించింది. ఒక మహిళ చేతిలో నుంచి స్టీల్ కప్ ఒకటి జారిపోయి వంతెనపై పడింది. దీంతో వంతెన పైపొరపై చిన్నపాటి పగుళ్లు రావడమే కాకుండా ఒక్కసారిగా పెద్ద శబ్దం కూడా వచ్చిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఈ సంఘటన చైనా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. దీనికి స్పందించిన అధికారులు, వంతెనపై ఏర్పడ్డ పగుళ్లు చిన్నపాటేవని, వంతెనకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. మరమ్మతుల నిమిత్తం ఆవంతెనను తాత్కాలికంగా మూసివేశామని, త్వరలో తెరుస్తామని వారు వివరించారు.

  • Loading...

More Telugu News