: 'రుద్రమదేవి'కి అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం


గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రగా రూపొంది రేపు వెండితెరను తాకనున్న రుద్రమదేవి చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం కేసీఆర్ ను కలిసిన గుణశేఖర్, తొలిరోజునే చిత్రాన్ని చూడాలని కేసీఆర్ ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ చిత్రం విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నానని తెలిపిన కేసీఆర్, తప్పకుండా సినిమా చూస్తానని తెలిపారు. తెలంగాణ చరిత్రను అందరికీ తెలిపేలా సినిమాను తీసిన గుణశేఖర్ ను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. చిత్రానికి పన్ను మినహాయింపును ఇస్తున్నామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News