: పొద్దున్నే ఇంతమంది వచ్చారు... రేపు ఏం జరుగుతుందో ఊహిస్తున్నా: మోదీ
"నన్ను చూసేందుకు, నేను చెప్పే మాటలు వినేందుకు పొద్దున్నే ఇన్ని వేల మంది వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ జన ప్రవాహాన్ని చూస్తుంటే, రేపు జరిగే ఎన్నికల్లో ఎటువంటి తీర్పు వస్తుందన్న విషయాన్ని నేను ఊహించగలుగుతున్నా. బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మీరు ఓట్లు వేయండి. ఆ మార్పును నేను చూపిస్తానని హామీ ఇస్తున్నా" అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంగేర్ లో జరిగిన సభలో ప్రసంగించారు. యోగా పాప్యులర్ కావడంలో ముంగేర్ స్థానం ఎంతో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇంతవరకూ ఆటవిక పాలన సాగిందని, దాన్ని తరిమికొట్టే అస్త్రం ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. కాగా, నేడు మోదీ బీహార్ లో సుడిగాలి పర్యటన జరపుతున్నారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.