: అమరావతిని సింగపూర్ కు, పోలవరంను జర్మనీకి అప్పగిస్తారా?: సీపీఎం కార్యదర్శి మధు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారశైలిని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుబట్టారు. ప్రత్యేక హోదాను సాధించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ ను సాధించడానికి వైకాపా అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రకటించారు. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కు, పోలవరం ప్రాజెక్టును జర్మనీకి అప్పగిస్తారా? అంటూ ప్రభుత్వంపై మధు విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.