: పెళ్లి వేడుకపై బాంబులు కురిపించిన విమానాలు!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని సాధ్యమైనంత త్వరగా అణచి వేయాలని దాడులు జరుపుతున్న దేశాలు, ఆ తొందరలో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ఆసుపత్రిపై అమెరికా వైమానిక దాడులు జరిపి, ఆపై పొరపాటు జరిగిందని నాలిక్కరచుకోగా, ఇప్పుడు తాజాగా యెమెన్ లో ఓ పెళ్లి వేడుకపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడిని ఏ దేశం విమానాలు చేశాయన్నది ఇంకా తెలియలేదు. రష్యా విమానాలు వివాహ వేడుకపై బాంబులు విసిరి ఉండవచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News