: సిరియాపై పోరు తీవ్రం - రంగంలోకి యుద్ధ నౌకలు, తొలిసారిగా క్షిపణుల ప్రయోగం


సిరియాలో పరిస్థితిని అదుపులోకి తేవడమే లక్ష్యంగా రష్యా మిలిటరీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. సిరియా తీరానికి 1000 మైళ్ల దూరంలో నిలిపి ఉంచిన యుద్ధ నౌకల నుంచి క్షిపణులను ఉగ్రవాద స్థావరాలపైకి ప్రయోగించింది. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సైన్యం పోరు జరుపుతూ, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులున్న స్థావరాల గురించి సమాచారం అందిస్తుంటే, దాని ఆధారంగా రష్యా యుద్ధ విమానాలు దూసుకొచ్చి బాంబులేస్తున్నాయి. ఇందుకు ఇరాన్ అధికారులు కూడా సహకారాన్ని అందిస్తున్నారు. కాస్పియన్ సముద్రంలో నిలిపిన యుద్ధ నౌకల నుంచి రష్యా ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్షిపణులను తయారు చేసిన తరువాత ప్రయోగించడం ఇదే మొదటిసారి. సిరియా సైన్యంతో పాటు హెజ్బుల్లా దళాలు ఒకవైపు, రష్యా సైన్యం వాయుమార్గాన దాడులు చేస్తుండటంతో ఐఎస్ఐఎస్ స్థావరాలు ఒక్కొక్కటిగా నాశనమవుతున్నట్టు తెలుస్తోంది. సిరియాలో తాము 11 లక్ష్యాలపై దాడులను చేశామని, ఇవి యుద్ధ నౌకల నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోనివని, తమ దాడుల్లో పౌరులెవరూ గాయపడలేదని రష్యా రక్షణ మంత్రి సెర్గి కే షోయిగు వెల్లడించారు.

  • Loading...

More Telugu News