: పారని దొంగల పాచిక...ఏటీఎంలు తెరచుకోకపోవడంతో రిక్తహస్తాలతో పలాయనం


అవును, చోరీకి వెళ్లిన దొంగల పాచిక పారలేదు. ముందుగా రెక్కీ నిర్వహించి సరంజామాతో కదిలివచ్చిన దొంగలు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అసలు విషయమేంటంటే... గడచిన రాత్రి కొందరు దొంగలు హైదరాబాదు శివారు ప్రాంతం వనస్థలిపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంకు ఏటీఎంలలోని నగదును ఎత్తుకెళ్లేందుకు వచ్చారు. అంతకుముందే ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన దొంగలు తమకు అనుకూలమైన సమయంలోనే చోరీ కోసం వచ్చారు. అనుకున్నట్లుగానే వారు వచ్చే సమయానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. దీంతో ఏటీఎంలలోకి దొంగలు చొరబడ్డారు. వెంట తెచ్చుకున్న సరంజామాతో ఏటీఎం మిషన్లను తెరిచేందుకు యత్నించారు. అయితే వారి పన్నాగం పారలేదు. ఎంత యత్నించినా ఏటీఎం మిషన్లు తెరచుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దొంగలు ఏటీఎం మిషన్లను ద్వంసం చేసైనా నగదు ఎత్తుకెళ్లాలని చూశారు. ఈ క్రమంలో వారి దాడిలో ఏటీఎం మిషన్లు ధ్వంసమైతే అయ్యాయి కానీ, అవి మాత్రం తెరచుకోలేదు. ఇక లాభం లేదనుకున్న దొంగలు అక్కడి నుంచి ఖాళీ చేతులతోనే వెళ్లిపోయారు. చోరీ యత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News