: కటక్ నిరసనలపై సమగ్ర నివేదికివ్వండి : బీసీసీఐ ఆదేశాలు
కటక్ లోని బారామతి స్టేడియంలోకి నీళ్ల బాటిళ్లను విసిరిన సంఘటనపై ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని బీసీసీఐ, ఒడిశా క్రికెట్ అసోసియేష్ ను ఆదేశించింది. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ 20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ప్రేక్షకులు నీళ్ల బాటిళ్లు విసిరేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పలు విమర్శలకు దారి తీసింది. దక్షిణాఫ్రికా విజయం దిశగా వెళుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. దీంతో రెండుసార్లు మ్యాచ్ ను నిలిపివేయడం కూడా జరిగింది. కాగా, ఈ ఘటనపై నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఒడిశా ముఖ్యమంత్రి కూడా నిన్న ఆదేశాలు జారీ చేశారు.