: చంద్రుడిపైకి తొలి ప్రైవేట్ రోవర్ ను పంపనున్న ఇజ్రాయిల్


2017 చివరి నాటికి చంద్రుడిపైకి తొలి ప్రైవేటు రోవర్ కాలుపెట్టనుంది. ఇజ్రాయిల్ కు చెందిన స్పేస్ ఐఎల్ అనే ప్రైవేటు సంస్థ ఒకటి ఈ ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఫ్లైట్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ ఐఎల్, స్పేస్ ఫ్లైట్ ఇండస్ట్రీస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 కనుక విజయవంతంగా చంద్రుడిపైకి చేరితే అమెరికా, రష్యా, చైనాల సరసన ఇజ్రాయిల్ కూడా చేరుతుంది. గూగుల్ లూనార్ ఎక్స్ ప్రైజ్ కాంపిటీషన్ లో భాగంగా ప్రైవేటు సంస్థలు చంద్రుడి పైకి రోవర్ ను పంపే ఒప్పందాల నిమిత్తం స్పేస్ ఫ్లైట్ ఇండస్ట్రీస్ ఆహ్వానాలు పలికింది. అందుకు ఇజ్రాయిల్ సంస్థ ముందుకు వచ్చింది. తొలిసారిగా ప్రైవేటు పరిశోధకుల బృందం చంద్రుడి పైకి పంపనున్న ఈ రోవర్ ప్రయోగం విజయవంతమైతే వారికి 30 మిలియన్ డాలర్లు లభిస్తాయి.

  • Loading...

More Telugu News