: అనంతపురంలో వర్షానికి కూలిన మహాలక్ష్మి ఆలయం


అనంతపురంలో ఈరోజు సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికి మహాలక్ష్మి ఆలయం కూలిపోయింది. స్థానిక పాతవూరు సమీపంలోని బుక్కరాయ సముద్రం చెరువుకట్టపై వెలసిన కొల్లాపూరమ్మ మహాలక్షి దేవాలయం వెనుక భాగం కూలిపోయింది. ఆలయ శకలాలు అక్కడే ఆగి ఉన్న ఒక సుమోపై పడటంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ సమాచారం తెలుసుకున్న అనంతపురం మేయర్ స్వరూప సంఘటనా స్థలానికి వెళ్లారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. కాగా, ఆలయం ఉన్న ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. అమ్మవారి దయ వల్లే ఎటువంటి ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకోలేదని ఆలయ పూజారులు తమ విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News