: అరగంటపాటు వ్యాయామం చేస్తే చాలదట!


గుండెనొప్పి మన దరిచేరకుండా ఉండాలంటే రోజు మొత్తంలో అరగంట పాటు వ్యాయామం చేస్తే చాలన్న నిపుణుల సూచనలు సరికాదన్న విషయాన్ని 'సర్క్యులేషన్' అనే ఒక సైంటిఫిక్ జర్నల్ ప్రచురించింది. దీనికి సంబంధించిన ఒక విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. శారీరకంగా పలుస్థాయుల్లో వ్యాయామం చేసే సుమారు 370, 460 మంది పురుషులు, మహిళలపై జరిపిన అధ్యయనాలను పరిశోధకులు ఈ సందర్భంగా సమీక్షించారు. వారు ఎంత సమయం పాటు వ్యాయామం చేశారన్న వివరాలను పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. అసలు వ్యాయామం చేయని వారితో పోలిస్తే, ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం చేసే వారికి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. రోజుకు రెండు నుంచి 4 సార్లు వ్యాయామం చేసే వారిలో హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ అతి తక్కువగా ఉంటుందని ఆ జర్నల్ లో వివరించారు.

  • Loading...

More Telugu News