: హైదరాబాదు లాడ్జిలో 8 కేజీల బంగారం
హైదరాబాదులోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం బాలానగర్ లోని ఓ లాడ్జ్ లో పెద్దఎత్తున బంగారం ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఆ లాడ్జ్ పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 కేజీల బంగారం పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు ప్రణాళిక రచించారని, అందులో భాగంగా దీనిని లాడ్జ్ లో ఉంచారని వారు వెల్లడించారు. కాగా, విమానాశ్రయాల్లో స్మగ్లింగ్ బంగారం పట్టుబడడం సర్వ సాధారణంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో లాడ్జ్ లో ఇంత పెద్దఎత్తున బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది.