: రోడ్డు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి... రూ. లక్ష ఎక్స్ గ్రేషియా


నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియాను ఆర్టీసీ తరపున చెల్లిస్తామని చెప్పారు. ఈ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భువనగిరి నుంచి నల్గొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News