: టామ్ క్రూస్ నివాసం అమ్మకానికి...కొనేవాళ్లున్నారా?


ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూస్ తన కొలరాడో క్యాబిన్ హౌస్ ను అమ్మకానికి పెట్టాడు. స్టోన్ చిమ్నీలు, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ నివాసంలో 10 వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 7 బెడ్ రూములు, 9 బాత్రూములు, అతిథుల కోసం ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇది టెల్లూరైడ్ ప్రాంతీయ విమానాశ్రయానికి పది నిమిషాలు, ఊరికి 12 నిమిషాల దూరంలో ఉంది. ఈ ఇంట్లో 1994 నుంచి టామ్ క్రూస్ నివాసం ఉంటున్నాడు. సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో మంచు శిఖరాల మధ్య ఉండే ఈ నివాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఇంటికి వెళ్లే దారిలో బిర్చ్ వృక్షాలు స్వాగతం పలుకుతున్నట్టు ఉంటాయి. ఈ ఇంటి ధరను సుమారు 60 మిలియన్ డాలర్లుగా రియల్టర్లు అంచనా వేస్తున్నారు. మన రూపాయల్లో 420 కోట్ల రూపాయలు. ఇంత ధరపెట్టి ఎవరు కొనగలరా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News