: అలస్కా ఎయిర్ లైన్స్ సీఈవోకి షాక్ ఇచ్చిన సిబ్బంది
సరసమైన ధరకు వేగవంతమైన కార్గో లైనర్ గా అలస్కా ఎయిర్ లైన్స్ కు పేరుంది. పేరుకు తగ్గట్టే అలస్కా ఎయిర్ లైన్స్ లో తక్కువ ధరకు వేగంగా లగేజీని చేరుస్తారని ప్రయాణికులు చెబుతారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని సార్లు లగేజీ మారిపోవడం, తప్పిపోవడం జరుగుతుంటుంది. ఈ సారి సాక్షాత్తూ ఎయిర్ లైన్స్ సీఈవోకి సిబ్బంది షాక్ ఇచ్చారు. అలస్కా ఎయిర్ లైన్స్ సీఈవో బ్రాడ్ టిల్డెన్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గత వారం జరిగిన ఓ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. అలస్కా ఎయిర్ లైన్స్ లో వాషింగ్టన్ డీసీ చేరుకున్నాక లగేజీ చూసుకుంటే కనపడలేదు. సీఈవో లగేజ్ కనబడకపోవడంతో అధికారులు తల పట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, 24 గంటల్లో ఆయన లగేజ్ ఆయనకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు.