: ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి బెయిల్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. న్యూఢిల్లీలోని ద్వారకా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కింద రూ.లక్ష వ్యక్తిగత బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. భార్య లిపికా మిత్రా పెట్టిన కేసులో గృహ హింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజుల కిందట లొంగిపోయారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో విచారించారు. ఈ సమయంలో రెండు సార్లు సోమనాథ్ బెయిల్ కోసం సుప్రీంకు వెళ్లగా నిరాశ ఎదురైంది. తాజాగా ఆయనకు కింది కోర్టు బెయిల్ ఇచ్చింది.