: చెరువుల మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయి: శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులు ఉండేవని... అప్పుడు రైతులంతా సుభిక్షంగా ఉండేవారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయని... దీంతో, చెరువులపై ఆధారపడ్డ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని విమర్శించారు. చెరువులు మాయం కావడంతో, వలసలు పెరిగాయని చెప్పారు. చెరువులకు పూర్వవైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. గత పాలకులు చెరువులను బాగు చేస్తామని చెబుతూ టెండర్లను పిలిచి దోచుకుపోయారే తప్ప, వారు చేసిందేమీ లేదని మండిపడ్డారు.