: గత పాలకుల వల్లే చెరువులు ధ్వంసం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే


గత పాలకుల వల్లే తెలంగాణాలో చెరువులు ధ్వంసమయ్యాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణాలో మైనర్ ఇరిగేషన్ ను ఆంధ్రా ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో గంగాళంలా ఉన్న చెరువులు తాంబాళంలా మారడానికి కారణం ఆంధ్రా పాలకులేనని మండిపడ్డారు. అయితే, సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయను ప్రవేశపెట్టడంతో ఇప్పుడు చెరువులు కళకళలాడుతున్నాయన్నారు. తాంబాళంలా ఉన్న చెరువులను గంగాళంలా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇంతగా ఫలితాలు సాధిస్తున్న మిషన్ కాకతీయపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మిషన్ కాకతీయ పనులు ఎక్కడా అవినీతికి తావులేకుండా జరిగాయన్నారు. రాద్ధాంతం చేయడమే పనిగి విపక్షాలు పెట్టుకున్నాయంటూ ఆల ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News