: తెలంగాణలో కరవు మండలాల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు


తెలంగాణ రాష్ట్రంలో కరవు మండలాలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సతీష్ చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో 8 మంది ఉన్నతాధికారులను నియమించారు. రాష్ట్రంలోని ఏయే మండలాల్లో కరవు ఏర్పడిందన్న వివరాలను కమిటీ సేకరించనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది సరైన వర్షాలు పడక, పంటలు పండే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర కరవు పరిస్థితులేర్పడ్డాయి. ఈ క్రమంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని విపక్షాలు కొన్ని రోజుల నుంచి తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఇవాళ కమిటీ ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News