: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సినీ నటి నగ్మా
కాంగ్రెస్ జాతీయ కార్యవర్గాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. కార్యవర్గంలోని పేర్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ అధికారికంగా ప్రకటించారు. గతంలో జరిగిన పలు ఎన్నికలలో కాంగ్రెస్ తరపున చురుకుగా ప్రచారం చేసిన సినీ నటి నగ్మాకు ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఆకుల లలిత అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కార్యవర్గంలో మొత్తం 11 మంది ప్రధాన కార్యదర్శులు, 9 మంది కార్యదర్శులు, నలుగురు ఎన్జీవో సమన్వయకర్తలు, ఒక ఐటి ఇన్ ఛార్జ్ ఉన్నారు. ఇక శోభా ఓజా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగాను, పార్టీ ప్రతినిధిగా ఉన్నారు.