: ఎలుకలను కంట్రోల్ చేయడం మానవసాధ్యం కాదు: మంత్రి కామినేని
ఆసుపత్రిలో ఎలుకలను అదుపు చేయడం మానవసాధ్యం కాదంటూ ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఎలుకల ఘటనను రాష్ట్రమంతటికీ ఆపాదించవద్దన్నారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈసీజీ ని అర్థం చేసు కోవడమెలా? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో ఎలుకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన ఇళ్లల్లో ఉన్న ఎలుకలు, బొద్దింకలనే అదుపు చేయలేకపోతున్నాము, ఇక ఆసుపత్రులలో వాటిని అదుపు చేయడమనేది ఎంతో కష్టంతో కూడు కున్నదన్నారు. ఈరోజు నుంచి జిల్లాల్లో రెండవ విడత ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, చిన్న పిల్లలకు ఏడు రకాల వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నామని కామినేని వివరించారు.