: అక్బరుద్దీన్ కు అరెస్ట్ వారెంట్ పై అసదుద్దీన్ స్పందన


ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పై ఆయన సోదరుడు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ కేసును తాము చట్టపరంగా ఎదుర్కొంటామని అసద్ చెప్పారు. అంతేగానీ తాను మాట్లాడటం సరికాదన్నారు. తమ న్యాయవాదులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేనిని తెలిపారు. న్యాయవాదులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని అసద్ పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీన బీహార్ లోని కిషన్ గంజ్ లో నిర్వహించిన బీహార్ ఎన్నికల ప్రచారంలో అక్బర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News