: నల్లగొండ జిల్లాలో కలకలం...ముఖానికి ముసుగులు, చేతుల్లో ఆయుధాలతో బైక్ పై యువకుల సంచారం
గతంలో నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ‘సూర్యాపేట షూటర్స్’ ఘటన అందరికీ గుర్తుండే వుంటుంది. అలాంటి ఉగ్రవాదుల తరహాలోనే ఇద్దరు యువకులు తాజాగా జిల్లాలోకి ప్రవేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖానికి ముసుగులు కట్టుకుని, చేతుల్లో ఆయుధాలతో ఇద్దరు యువకులు సీబీజెడ్ బైక్ పై సంచారిస్తున్నారట. జిల్లాలోని చిలుకూరు మండలంలో ఆ యువకులను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు యువకుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.