: మోదీపై నిరసనాస్త్రం ... కేంద్రానికి తిరిగొచ్చిన మరో ‘సాహిత్య’ పురస్కారం
దేశంలో పెచ్చరిల్లుతున్న హింసపై సున్నిత మనస్కులైన రచయితలు గళం విప్పారు. కలం బలంతో సమాజంలోని అపసవ్య ధోరణులను ప్రస్తావిస్తున్న కాల్ బుర్గి, నరేంద్ర ధబోల్కర్ తరహా కవులతో పాటు అమాయకులైన అఖ్లాల్ లు హత్యకు గురైన వైనంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పడం లేదని ఆరోపిస్తూ దేశ ప్రప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ తనకు దక్కిన సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తిరిగిచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెహగల్ బాటలోనే మరో కవి, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత అశోక్ వాజ్ పేయి నడిచారు. దేశంలో పెచ్చరిల్లుతున్న హింసపై నిరసన వ్యక్తం చేసిన వాజ్ పేయి తనకు అందిన సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తున్నట్లు ప్రకటించారు.