: చత్తీస్ గఢ్ లో కాల్పులు... ఓ మహిళ సహా ఆరుగురు మావోల మృతి
చత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ జిల్లా దర్భాఘాట్ లో ఈ తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు సహా ఆరుగురు మరణించారని తెలిసింది. మృతుల్లో ఏరియా కమాండర్ ఉన్నట్టు సమాచారం. జగదల్ పూర్ జిల్లాలో నిన్న(మంగళవారం) వందమంది గిరిజనులను మావోలు కిడ్నాప్ చేశారు. వారిని వెతికే క్రమంలో మావోలు ఎదురుపడగా పోలీసులు కాల్పులు జరిపారు. దాంతో మావోలు కూడా ఎదురు కాల్పులకు దిగారు. అయితే గిరిజనుల జాడ ఇంకా తెలియాల్సి ఉంది.