: అశ్విన్ ఓకే... సత్తా లోపించిన టీమిండియా బౌలింగ్: ‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’ కామెంట్


టీమిండియా బౌలింగ్ సత్తాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’గా ఖ్యాతినందుకున్న షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మినహా టీమిండియాలో సత్తా కలిగిన బౌలరే లేడంటూ అతడు నిన్న వ్యాఖ్యానించాడు. టీమిండియా బౌలింగ్ లో అసలు సత్తానే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. ‘ఫ్రీడమ్ సిరీస్’లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ ను తప్పుబట్టిన అతడు టీ20ల్లో టీమిండియా అనుసరిస్తున్న వ్యూహాన్ని కూడా తప్పుబట్టాడు. జట్టు కూర్పుతో పాటు టీ20లు ఆడే విధానంపై కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరింత అధ్యయనం చేయాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News