: శ్రీవారిని దర్శించుకున్న 'రుద్రమదేవి' చిత్రం యూనిట్
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని 'రుద్రమదేవి' చిత్ర యూనిట్ ఇవాళ దర్శించుకుంది. ఈ సినిమా కథానాయిక అనుష్క, దర్శకుడు గుణశేఖర్ వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల చెంత రుద్రమదేవి చిత్రం మొదటికాపీ ఉంచి పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన అనుష్కను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఈ నెల 9న ఈ చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో వారంతా స్వామివారి దర్శనానికి వచ్చారు.