: లారీ ఢీకొని దంపతుల దుర్మరణం


ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులను సిమెంట్ లారీ ఢీకొట్టిన సంఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మూడేళ్ల చిన్నారి గాయపడింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని శ్రీరాంపూర్ సమీపంలో ఈ రోజు రాత్రి జరిగింది. మృతులు శ్రీరాంపూర్ కు చెందిన నాగరాజు, సబితగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో మృతుల బంధువులు, గ్రామస్తులు రోదిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News