: మళ్లీ జైలుకెళ్లిన ఇంద్రాణి ముఖర్జియా
షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులో ఫిట్స్ మాత్రలు మోతాదుకు మించి మింగి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను రెండు రోజుల క్రితం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పై చికిత్స అందించిన వైద్యులు నేడు డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు ఆమెను మళ్లీ జైలుకు తరలించారు. కాగా, బెయిల్ పొందే కుట్రలో భాగంగా ఆమె ఆత్మహత్యాయత్నం నాటకం ఆడిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కీలకమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిన పోలీసు అధికారులు, ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటామని పేర్కొన్నారు.