: సల్మాన్ వస్తువుల్ని లేపేశారు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వస్తువుల్ని 'లేడీ ఫ్యాన్స్' లేపేయడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం, తను నివాసం ఉంటున్న బాంద్రాలో ప్రాంతంలోని ఓ క్లబ్ కు సల్మాన్ వెళ్లాడు. అక్కడ నలుగురు యువతులు సల్లూ భాయ్ వీరాభిమానులమంటూ అతన్ని చుట్టుముట్టారు. దీంతో సల్లూ భాయ్ తన పర్సు, సన్ గ్లాసెస్, పెండెంట్ పక్కనున్న టేబుల్ పై పెట్టి, వారితో కబుర్లలో మునిగిపోయాడు. కాసేపటికి వారంతా 'బాయ్' చెప్పి వెళ్లిపోయారు. అనంతరం టేబుల్ పై తాను పెట్టిన వస్తువుల కోసం చూసుకుంటే అవి కనిపించలేదు. దీంతో బాడీగార్డ్స్ కి సల్లూభాయ్ విషయం చెప్పాడు. వారు క్లబ్ లో తనిఖీలు చేసినా వస్తువులు దొరకలేదు. దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని సూచించారు. దానికి సల్లూభాయ్ నిరాకరించాడట.