: అది ప్రింటింగ్ తప్పు: కుమారుల వయసు వివాదంపై లాలూ


కుమారుల వయసు వివాదంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. అది ప్రింటింగ్ సందర్భంగా దొర్లిన తప్పని, దానిని భూతద్దంలో చూడాల్సిన పని లేదని, దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన వయసు 25 ఏళ్లు అని పేర్కొనగా, చిన్న కుమారుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ తన వయసు 26 ఏళ్లు అని పేర్కొన్నాడు. దీంతో లాలూ కుమారుల వయసుపై పెను వివాదం రేగింది. దీనిపై లాలూ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News