: ఐరాసకు లేఖ రాసి అజంఖాన్ తప్పు చేశాడు: అసదుద్దీన్ ఒవైసీ
భారతదేశంలో ముస్లింల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ... ఉత్తరప్రదేశ్ లోని దాద్రీ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దానిపై ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను దేశంలోనే పరిష్కరించుకునే పరిస్థితి ఉన్నా ఐరాస దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని ఢిల్లీలో ప్రశ్నించారు. అజం చర్య ప్రమాదకరమైందన్నారు. అసలు తప్పంతా యూపీ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ముస్లింలకు భద్రత కల్పించలేకపోతున్న సీఎం అఖిలేష్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని విమర్శించారు.