: విపక్షాలు లేని సభను పార్టీ సభగానే పరిగణించాలి: చాడ వెంకట్ రెడ్డి


తెలంగాణ శాసనసభలో మజ్లిస్ మినహా దాదాపు విపక్ష సభ్యులందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సస్పెండ్ చేయడం దారుణమని కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. విపక్షాలు లేని సభను పార్టీ సభగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంలో మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ నడుస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులతోనే అసెంబ్లీ ఎలా నడుపుతారని చాడ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజావేదిక ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News