: 'నిషేధిత జంతు మాంసం' తిన్నాడన్న అనుమానమే అక్లఖ్ హత్యకు కారణం!: దాద్రి ఘటనపై కేంద్రానికి రాష్ట్రం నివేదిక


'నిషేధించిన జంతు మాంసం' తిన్నాడన్న అనుమానమే మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తి హత్యకు కారణమైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఆ రాష్ట్రంలోని దాద్రీకి దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన అక్లఖ్ ను ఆవు మాంసం తిన్నాడనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపిన ఘటనపై ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసింది. అయితే నివేదికలో ఎక్కడా 'బీఫ్' అనే పదం వాడలేదు. దానికి బదులుగా 'నిషేధించిన జంతు మాంసం' అనే పదాలను వాడారు. కాగా, ఈ ఘటన తరువాత ఆ గ్రామంలో పర్యటించిన పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైంది.

  • Loading...

More Telugu News