: ముగ్గురు తెలుగుదేశం నేతలను అపహరించిన మావోలు


విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఏజన్సీ ప్రాంతంలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు ఈ ఉదయం అపహరించుకుపోయారు. ఈ ఘటన జీకే వీధి మండలం, కొత్తగూడలో జరిగింది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాలయ్య పడాల్ ను ఆయన ఇంటి నుంచే మావోలు అపహరించారు. ఆయనతో పాటు పార్టీ స్థానిక నాయకులు మహేష్, బాలయ్యలను కిడ్నాప్ చేశారు. వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News