: అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం... అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
రైతు రుణాల మాఫీపై ‘సింగిల్ సెటిల్ మెంట్’ కోసం పట్టుబట్టిన విపక్షాలను నిన్న తెలంగాణ సర్కారు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది. విపక్షాల మూకుమ్మడి సస్పెన్షన్లపై ప్రతిపక్షాల ఆందోళనలు నిన్ననే మొదలైనప్పటికీ, నేటి ఉదయం అవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. యూత్ కాంగ్రెస్ నేతలు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అసెంబ్లీ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.