: పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు... 11 మంది విద్యార్థులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
చిన్నారులను క్షేమంగా పాఠశాలకు చేర్చాల్సిన స్కూల్ బస్సు అదుపు తప్పింది. పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్ధులకు గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే... ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఎర్రబాలెం సమీపంలో సిద్ధార్థ స్కూల్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. సమీప గ్రామాల్లోని విద్యార్థులను స్కూల్ కు తీసుకెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ పిల్లలను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.