: రోడ్డుపై న్యూసెన్స్ చేసిన టాలీవుడ్ నటుడు తనీష్ కు జరిమానా


యాక్సిడెంట్ చేసి ఆపకుండా వెళ్లడం, ఆపై నడిరోడ్డుపై న్యూసెన్స్ చేయడం ఆరోపణలపై కోర్టుకు వెళ్లి తప్పును అంగీకరించిన టాలీవుడ్ హీరో తనీష్ కు న్యాయమూర్తి రూ. 50 జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే, ఈ నెల 1వ తేదీన రాత్రి 9 గంటలకు, జూబ్లీహిల్స్ రోడ్ నం. 1/45 చౌరస్తాలో, మద్యం తాగి వాహనం నడుపుతూ వెళుతున్న తనీష్ బైక్ పై ప్రయాణిస్తున్న సురేష్ అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. ఆపై తన వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. బాధితులు తన బైక్ పై చేజ్ చేసి తనీష్ కారును అడ్డుకోగా, ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. తనీష్ తాగి తనను దుర్భాషలాడాడని సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 70 (బీ) కింద న్యూసెన్స్ కేసు పెట్టి కోర్టుకు హాజరు పరచగా, న్యాయమూర్తి జరిమానా విధించారు.

  • Loading...

More Telugu News