: బ్లూమ్ బర్గ్ ప్రభావశీలుర జాబితాలో మోదీకి చోటు... 13వ స్థానంలో భారత ప్రధాని
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. బ్లూమ్ బర్గ్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో నరేంద్ర మోదీ చోటు సాధించారు. ఇటీవలి విదేశీ పర్యటనలతో ప్రపంచం దృష్టిని మరింతగా ఆకర్షించిన ప్రధాని ఆ జాబితా తొలి 50 మందిలో చోటు దక్కించుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ ఎలెన్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో భారత ప్రధానికి చోటు దక్కడం ఇదే తొలిసారి. రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు, వెంచర్ కేపిటలిస్ట్ లు, బ్యాంకర్లు, కార్పొరేట్ దిగ్గజాలు తదితరులతో కూడుకున్న ఈ జాబితాలో రాజకీయ నేతలకు సంబంధించి మరో ముగ్గురు మాత్రమే మోదీ కంటే ఎగువన ఉన్నారు. వారిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జర్మనీ చాన్సెలర్ ఎంజెలా మెర్కెల్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్ లు ఉన్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన మోదీ, 30 ఏళ్ల తర్వాత భారత్ లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగారని ‘బ్లూమ్ బర్గ్’ పేర్కొంది. ఇక గతేడాది ఈ జాబితాలోె చోటు దక్కించుకున్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యలిద్దరూ ఈ ఏడాది జాబితాలో స్థానం కోల్పోయారు.