: టర్కీ గగనతలంలోకి పొరపాటున ప్రవేశించిన రష్యా విమానం
రష్యా వైమానిక విమానం ఒకటి టర్కీ గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో టర్కీ వాయుసేన విమానాలు ఆ విమానాన్ని వెంబడించాయి. కొద్దిసేపటి తర్వాత రష్యా విమానం తిరిగి వెనక్కివెళ్లి పోయింది. అయితే తమ విమానం పొరపాటున టర్కీ గగనతలంలోకి ప్రవేశించిందంటూ రష్యా అధికారులు ప్రకటించడంతో సమస్య సద్దుమణిగింది. కాగా, సిరియాలో అధ్యక్షుడు అస్సాద్ వ్యతిరేకవర్గంతో పాటు ఐఎస్ పై రష్యా వైమానిక దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.